Nidamarru: నిడమర్రులో తక్కువ ధరకే బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

Nidamarru: నిడమర్రులో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయించే కేంద్రాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ఆధార్‌పై 10 కిలోల బియ్యం అందజేత.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 4 Aug 2026 5:14 PM IST
Nidamarru
X

Nidamarru: నిడమర్రులో తక్కువ ధరకే బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

నిడమర్రు: ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న"మినీ మార్ట్"లలో భాగంగా మంగళవారం నిడమర్రు మండలం నిడమర్రు గ్రామంలో ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల కేంద్రం మైలవరపు లాలయ్య గారికి సంబంధించిన శ్రీ లక్ష్మీ జనరల్ మార్ట్ ను ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు గారు మాట్లాడుతూ, ఈ కేంద్రంలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52కు, బీపీటీ రా రైస్ కిలో రూ.50కు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 10 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ, ప్రతి కుటుంబంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story