Nuzvid: క్వాలిటీలో రాజీ పడొద్దు: మంత్రి కొలుసు పార్థసారథి

Nuzvid: నూజివీడు పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు ఆదేశాలిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Oct 2026 5:45 PM IST
Nuzvid
X

Nuzvid: క్వాలిటీలో రాజీ పడొద్దు: మంత్రి కొలుసు పార్థసారథి

Nuzvid: నూజివీడు పట్టణంలో గత 15 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నేడు శరవేగంగా చేస్తూ ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేడు పట్టణంలోని హనుమాన్ జంక్షన్ రోడ్డులో జరుగుతున్న డ్రైనేజీ,సిసి రోడ్లు,సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.నిర్దేశించిన లక్ష్యాలు చేరాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.ఇప్పటికే నగరంలో సెంట్రల్ లైటింగ్,డివైడర్,రోడ్ల వెడల్పు,డ్రైనేజీపూడికతీత,ఇండోర్ స్టేడియం ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

సుమారు రూ.42 లక్షలతో పీజీ కళాశాల నుండి ద్వారకా సినీ థియేటర్,సింగ్ హోటల్ వరకు డ్రైనేజీ,బిటి రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

రానున్న కొన్ని నెలల్లో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ,సీసీ రోడ్లు,సెంట్రల్ లైటింగ్ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసి నూజివీడు నగరానికి ఒక కొత్త రూపు తెచ్చి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.మంత్రి వెంట మున్సిపల్ అధికారులు,ఇంజనీరింగ్ అధికారులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్