Nuzvid: నూజివీడులో ఘనంగా కోట మహిషాసుర మర్దిని పూజలు
Nuzvid: రెండో మైసూర్గా ప్రసిద్ధి చెందిన నూజివీడులో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. కోట మహిషాసుర మర్దిని అమ్మవారిని సబ్ జడ్జి శోభారాణి దంపతులు దర్శించుకున్నారు.
Nuzvid: నూజివీడులో ఘనంగా కోట మహిషాసుర మర్దిని పూజలు
Nuzvid: మైసూర్ తర్వాత రెండవ మైసూర్ గా ప్రసిద్ధిగాంచిన నూజివీడు పట్టణంలో విజయదశమి సందర్భంగా దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా నూజివీడు యలమర్రు ఎస్టేట్ జమీందారు వంశస్థులు మేకా.వెంకటాద్రి మెహర్ రామ్ అప్పారావు మరియు స్పోర్టింగ్ క్లబ్ సభ్యులు పిలుపుమేరకు కర్నూలు జిల్లా నందికొట్కూర్ సబ్ జడ్జి శోభారాణి దంపతులు నూజివీడు విచ్చేసి పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి కోటా మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు.




