Nuzvid: టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన తాళం వెంకటేశ్వరరావు!
Nuzvid: నూజివీడు దేవరగుంట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ తాళం వెంకటేశ్వరరావు 200 మందితో కలిసి మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు సమక్షంలో వైసీపీలో చేరారు.
Nuzvid: టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన తాళం వెంకటేశ్వరరావు!
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పలువురు టిడిపి నుండి వైసీపీలోకి చేరిన వైనం వివరాల్లోకి వెళితే వైసీపీలో చేరిన నూజివీడు మండలం దేవరగుంట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపిపి,మాజీ సర్పంచ్ తాళం వెంకటేశ్వరరావు నేడు 200 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరారు.నూజివీడు పట్టణంలోని
ద్వారకా ఎస్టేట్‌లో వైసీపీ కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న తాళం వెంకటేశ్వరరావు ఆయన అనుచరులు నేడు వైసీపీలో చేరారు.అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన తీరు నచ్చకే వైసీపీలో చేరుతున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమం పాల్గొన్న వైస్సార్సీపీ ఏలూరు జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ పల్నాటి రఘు,మాజీ ఎంపీటీసీ సభ్యులు నక్క శ్రీనివాసరావు మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




