Nuzvid: ఎన్నికలయ్యాక 100 మందికి ఇళ్ల పట్టాలు: మంత్రి హామీ!
Nuzvid: నూజివీడు మున్సిపాలిటీ 15, 16 వార్డుల్లో మంత్రి కొలుసు పార్థసారథి ఇంటింటి ప్రచారం చేశారు. ఎన్నికలయ్యాక 100 మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
Nuzvid: ఎన్నికలయ్యాక 100 మందికి ఇళ్ల పట్టాలు: మంత్రి హామీ!
నూజివీడు: నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. ఆదివారం నూజివీడు మున్సిపాలిటీ పరిధిలోని 15,16వ వార్డుల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు.
ముఖ్య నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆయన వార్డుల్లో డోర్-టు-డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను,పెండింగ్ పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ వార్డుల్లోని సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న 100 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే వార్డుల పరిధిలో ఒక కమ్యూనిటీ హాల్,ఒక నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




