Nuzvid: ఒక్క ఓటు - ఐదేళ్ల భవిష్యత్తు భరోసా: మంత్రి పార్థసారథి!
Nuzvid: నూజివీడు మున్సిపాలిటీ 1వ వార్డులో కూటమి చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా తరఫున మంత్రి కొలుసు పార్థసారథి ప్రచారం చేసి, రూ.5 కోట్లతో డ్రైనేజీ పనుల హామీ ఇచ్చారు.
Nuzvid: ఒక్క ఓటు - ఐదేళ్ల భవిష్యత్తు భరోసా: మంత్రి పార్థసారథి!
నూజివీడు: నూజివీడు మున్సిపాలిటీ 1వ వార్డులో కూటమి చైర్మన్ అభ్యర్థి బర్రె.ఇళయరాజా మరియు ఇతర అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకుంటూ సాగిన ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను పంచుకున్నారుకూటమి ప్రభుత్వం తిరుపతి,వైజాగ్,మంగళగిరిల్లో రూ.2 నుండి 3 కోట్ల విలువైన స్థలాల పట్టాలను 50 వేల మంది పేదలకు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. "ఒక్క ఓటు - ఐదేళ్ల భవిష్యత్తు భరోసా" అని పేర్కొంటూ, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని మంత్రి కోరారు.
గత ప్రభుత్వం ఎమ్మార్ అప్పారావు కాలనీని ఏటీఎంలా వాడుకుందని,ఒకే పట్టాను నలుగురికి ఇచ్చి మోసం చేసిందని,ఎమ్మార్ అప్పారావు కాలనీలో ఇప్పటికే రూ.2 కోట్ల వరకు పనులు చేశామని,ఎన్నికల తర్వాత ఈ వార్డులో రూ.5 కోట్లతో డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా,కూటమి నేతలు,కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




