Nuzvid: ఫోటోగ్రాఫర్ దిలీప్ కుమార్‌కు ‘భారత్ కళా పురస్కారం’
Nuzvid: నూజివీడుకు చెందిన ఫ్యాషన్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ దిలీప్ కుమార్‌కు వరుసగా రెండో ఏడాది భారత్ కళా పురస్కారం లభించింది.
Nuzvid: ఫోటోగ్రాఫర్ దిలీప్ కుమార్‌కు ‘భారత్ కళా పురస్కారం’
నూజివీడు: ఫోటోగ్రఫీ రంగంలో నూజివీడుకు చెందిన దిలీప్ కుమార్ తనదైన గుర్తింపును సాధిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఫోటోగ్రఫీ సేవలు అందిస్తున్న ఆయనకు భారత్ కళా పురస్కారం–2026లో ‘బెస్ట్ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్’ అవార్డు లభించింది. వరుసగా రెండో ఏడాది ఇదే అవార్డును అందుకోవడం విశేషం.
దిలీప్ కుమార్ ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్‌లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీ, ముంబై నగరాల్లో ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్లతో కలిసి పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. మ్యాగజైన్లు,ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు, ప్రకటన సంస్థలతో కలిసి కూడా ఆయన పనిచేశారు.
ప్రస్తుతం హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ‘ఫ్యాబ్ వెడ్డింగ్ స్టోరీస్’ ద్వారా భారీ స్థాయి వివాహాలు, ప్రీమియం వెడ్డింగ్ ఈవెంట్లను చిత్రీకరిస్తున్నారు. వివాహ వేడుకల్లో సహజమైన భావోద్వేగాలు, ప్రత్యేక సందర్భాలను అందంగా క్యాండిడ్ ఫోటోగ్రఫీ రూపంలో బంధించడంలో ఆయన ప్రత్యేకతను సాధించారు.
తాను సంపాదించిన అనుభవం,నైపుణ్యాలను స్వస్థలమైన నూజివీడుతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం తన లక్ష్యమని దిలీప్ కుమార్ తెలిపారు.ముఖ్యంగా కైకలూరు,గుడివాడ,తిరువూరు,మైలవరం తదితర ప్రాంతాల్లోని వివాహాలు, ప్రత్యేక కార్యక్రమాలకు నాణ్యమైన ఫోటోగ్రఫీ సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.
వరుసగా రెండో ఏడాది ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం పట్ల నూజివీడు ప్రాంతానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.




