Nuzvid: నూజివీడులో ఘనంగా రోటరీ యూత్ ఫెస్టివల్ వాలీబాల్ పోటీలు
Nuzvid: రోటరీ క్లబ్ ఆఫ్ నూజివీడు మ్యాంగో టౌన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 27 జట్లు తలపడుతుండగా, నవంబర్ 30న బహుమతి ప్రదానం.
Nuzvid: నూజివీడులో ఘనంగా రోటరీ యూత్ ఫెస్టివల్ వాలీబాల్ పోటీలు
నూజివీడు: రోటరీ క్లబ్ ఆఫ్ నూజివీడు మ్యాంగో టౌన్ ఆధ్వర్యంలో 'రోటరీ యూత్ ఫెస్టివల్'లో భాగంగా నేడు పలు విభాగాలలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు.ఈ పోటీలను క్లబ్ అధ్యక్షులు బోయపాటి ముఖర్జీ,కార్యదర్శి మల్లిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.
వ్యాయామ ఉపాధ్యాయులు యరకయ్య పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలలో వివిధ విభాగాల నుండి మొత్తం 27 జట్లు తలపడుతున్నాయి.
విజేతలకు ఈ నెల 30వ తేదీ సాయంత్రం బహుమతి ప్రదానం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో యూత్ సర్వీసెస్ డైరెక్టర్ శశికాంత్,కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ యార్లగడ్డ రాజగోపాల్,సభ్యులు మూల్పురి.లక్ష్మణస్వామి,మండా.శ్రీనివాస్,గొల్లపూడి రవిబాబు,కుప్పాల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.




