Polavaram: రోడ్డెక్కిన చెత్త పట్టించుకోని అధికారులు.. 4 నెలలుగా జీతాల్లేక కార్మికుల వేదన
Polavaram: ఏలూరు జిల్లా పోలవరం మేజర్ పంచాయతీలో 4 నెలలుగా జీతాలు అందక పారిశుధ్య కార్మికులు అలమటిస్తుండగా, రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది.
Polavaram: రోడ్డెక్కిన చెత్త పట్టించుకోని అధికారులు.. 4 నెలలుగా జీతాల్లేక కార్మికుల వేదన
ఏలూరు జిల్లా: పోలవరం గ్రామపంచాయతీలో నాలుగు నెలలుగా జీతాలు లేక కార్మికులు వేదన పడుతున్నారు. పోలవరం మండలం పోలవరం పంచాయతీలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతిరోజు వందలాదిగా తిరుగుతున్న రోడ్డు మార్గంలో కూడా ఈ చెత్తను తొలగించే పనులు కూడా చేపట్టకపోవడం లేదని పంచాయతీ ప్రజలు ఆరోపిస్తున్నారు.
వర్షాల కారణంగా ఈ చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుందని, ఇలా ఉంటే రోగాల బారిన పడతామని చుట్టుపక్కల ప్రజలు అంటున్నారు. అయితే పంచాయతీ సిబ్బంది వారానికి రెండుసార్లు ఈ ప్రదేశంలో ఈ చెత్తను తొలగించినప్పటికీ మళ్లీ యధావిధిగా వేసేస్తున్నారని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. పేరుకు మాత్రం పెద్ద పంచాయతీ లక్షల్లో ఆదాయం వస్తుందని అందరూ అనుకుంటారు.
కానీ ఈ పంచాయతీలో గత నాలుగు నెలలుగా కార్మికులకు జీతాలు లేవు. పంచాయతీలో ఆదాయం లేదంటూ అధికారులు చెబుతున్నారని గ్రామ ప్రజలు అంటున్నారు. ఒక్క నెల జీతాలు ఆలస్యమైతే చాలు అధికారులు విలువల ఆడే పరిస్థితి ఏర్పడుతుందని అంటారు గాని . ఏదో అరకొరకు చాలీచాలని జీతాలతో జీవనం గడుపుతున్న కార్మికులకు మాత్రం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అప్పులతో ఫైనాన్స్ లు తీసుకుని గడుపుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చి, ఊరిలో ఉన్న పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలా చేయాలని, ప్రజలు ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు గ్రామస్తులు.




