Eluru: ప్రధాని చేతుల మీదుగా జంగారెడ్డిగూడెం యువకుడికి సత్కారం!

Eluru: జపాన్‌లో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో మూడు పతకాలు సాధించిన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం యువకుడు రవి కార్తీక్ బుడిగినను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సత్కరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Nov 2026 5:01 PM IST
Eluru
X

Eluru: ప్రధాని చేతుల మీదుగా జంగారెడ్డిగూడెం యువకుడికి సత్కారం!

ఏలూరు: భారత పారా స్విమ్మింగ్ సంచలనం,తెలుగు తేజం రవి కార్తీక్ బుడిగినకు అరుదైన గౌరవం దక్కింది.జపాన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా పారా గేమ్స్‌లో మూడు పతకాలతో దేశ ఖ్యాతిని చాటిన రవి కార్తీక్‌ను గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రధాని పిలుపు మేరకు ఆయన్ను కలిసిన రవి కార్తీక్‌ను మోదీ శాలువాతో సత్కరించి, క్రీడారంగంలో యువతకు ఆదర్శంగా నిలిచారంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన సీనియర్ న్యాయవాది బుడిగిన నాగేంద్ర కుమార్ కుమారుడైన రవి కార్తీక్, అంతర్జాతీయ స్థాయిలో రాణించి సాక్షాత్తూ ప్రధాని చేతుల మీదుగా ప్రశంసలు అందుకోవడం పట్ల స్థానికులు మరియు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్