Chintoor: చింతూరు-2 సీపీఎం ఎంపీటీసీగా సీసం సురేష్ నామినేషన్!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు-2 ఎంపీటీసీ అభ్యర్థిగా సీపీఎం నేత సీసం సురేష్ నామినేషన్ దాఖలు చేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 22 Oct 2026 10:10 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు-2 సీపీఎం ఎంపీటీసీగా సీసం సురేష్ నామినేషన్!

చింతూరు: చింతూరు -2 సిపిఎం ఎంపీటీసీ అభ్యర్థిగా సేసం సురేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.సిపిఎం నాయకులు పల్లపు వెంకట్, ఎర్రంశెట్టి శ్రీనివాస్ లు సురేష్ తో నామినేషన్ దాఖలు చేయించారు.సీసం సురేష్ గతంలో చింతూరు మండల సిపిఎం కార్యదర్శిగా పనిచేయడం జరిగింది.ఆ సమయంలో సురేష్ ప్రజా సమస్యల పై పోరాటాలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది.

చింతూరు -2 ఎంపీటీసీ అభ్యర్థిగా సురేష్ పోటీ చేయడం పట్ల సిపిఎం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటాలు చేస్తూ ఉంటానని అన్నారు.చింతూరు -2 ఎంపీటీసీ స్థానానికి వైఎస్ఆర్సిపి,కూటమి బలమైన అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. దీంతో చింతూరు -2 ఎంపీటీసీ స్థానానికి రాజకీయం రసవత్తరంగా మారింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR