Polavaram: ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు
Polavaram: రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 67 మంది విద్యార్థులకు 'షైనింగ్ స్టార్' అవార్డు.
Polavaram: ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు
పోలవరం జిల్లా: వివిధ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు.
మంగళవారం రంపచోడవరం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో పోలవరం జిల్లాలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్లో జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో మంచి మార్కులతో ప్రతిభ కనబరిచిన సైనింగ్ స్టార్ విద్యార్థులకు 20వేల రూపాయల ప్రైజ్ మనీ, మెడల్స్, సర్టిఫికెట్ అందజేయు కార్యక్రమానికి పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్, రంపచోడవరం శాసనసభ్యులు, లెజిస్టేటివ్ చైర్మన్ శ్రీమతి మిరియాల శిరీష దేవి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ నెంబర్ గొర్లె సునీత, జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్, ఎంపీపీ శ్రీమతి బంధం శ్రీదేవి, జడ్పిటిసి శ్రీమతి పండ వెంకటలక్ష్మి, ఇంటర్మీడియట్ ఆర్ జె డి శేఖర్ బాబు, డి ఐ ఓ కరుణాకర్ రావు, డీఈవో జి. శ్రీరామ్ మూర్తి ముఖ్య అతిథులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ నూతనముగా ఏర్పడిన పోలవరం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా అని ఈ నూతన పోలవరం జిల్లాలో చదువుతోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొని బాధ్యత మన అందరిపై ఉందని ఆయన అన్నారు. ప్రతి మనిషి అభివృద్ధి చెందాలంటే విద్య చాలా ముఖ్యమైనదని అందుకు చిన్నతనం నుండే విద్యపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
చదువుకున్న ప్రతి వ్యక్తి కి చదువు ఒక మార్గాన్ని చూపిస్తుందని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని మంచి మార్కులతో పాసై మిగతా విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. పదవ పాసై మీకు నచ్చిన సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయిన వెంటనే ప్రతి విద్యార్థి ఒక గోల్ పెట్టుకోవాలని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, లాయర్, రాజకీయాలలో రాణించే విధంగా ముందుగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
ప్రతి ఇంట్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు మంచి చదువులు చదువుకునే విధంగా ప్రోత్సహించాలని ఆయన అన్నారు. వివిధ రంగాలలో ఆడపిల్లలు ముందుండి అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.
ప్రతి విజయం వెనక ఒక చరిత్ర ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచంలో అందరికీ 24 గంటలు ఉంటుందని ఆ 24 గంటల్లో చదువుకు కొంత సమయం తప్పనిసరిగా కేటాయించాలని ఆయన అన్నారు. చదువుకునే వయసులో చదువుపైనే దృష్టి పెట్టి కష్టపడి చదువుకుంటే మీ జీవితాలనే చదువు మార్చేస్తుందని ఆయన అన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలో 52 మంది పదో తరగతి విద్యార్థులకు, 15 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులందరికీ సైనింగ్ స్టార్ అవార్డులు రావటం చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు.
ఈ అవార్డులకు ఎంపికైన విద్యార్థులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. రంపచోడవరం శాసనసభ్యులు, లెజిస్టేటివ్ చైర్మన్ శ్రీమతి మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ పోలవరం జిల్లాలో 52 మంది పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో రాష్ట్రస్థాయి,జిల్లా స్థాయి అదేవిధంగా పోలవరం జిల్లాలో 15 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో మంచి మార్కులతో పాస్ అవడం చాలా చాలా సంతోషకరమైన విషయమని ఆమె అన్నారు. మొత్తం 67 మంది విద్యార్థులకు 20వేల రూపాయలు ప్రైజ్ మనీ, మెడల్, సర్టిఫికెట్ అవార్డులు
ఈరోజు అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. మన రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేసే విధంగా వివిధ రకాలైన పథకాలు అమలు చేయడం జరిగిందని అదేవిధంగా ప్రతిరోజు విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు బరువు తగ్గించి,మేధస్సును పెంచే విధంగా సిలబస్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. వచ్చే సంవత్సరం పదవ తరగతిలో, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో నూటికి నూరు శాతం ప్రతి విద్యార్థి రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ప్రతి విద్యార్థి శ్రద్ధగా విని విద్యపై దృష్టి పెట్టి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆమె అన్నారు. పోలవరం జిల్లాలో బాల్య వివాహాలు నిర్మూలించే విధంగా ప్రతి మహిళ చదువు పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని అదేవిదంగా 18 సంవత్సరాలకు ముందు ఎట్టి పరిస్థితులలో పెళ్లిళ్లకు అంగీకరించవద్దని ఆమె అన్నారు.
ప్రతి విద్యార్థి పదో తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో మీకు నచ్చిన సబ్జెక్టులు తీసుకొని మీ జీవితాలను మెరుగుపరుచుకునే విధంగా మంచి మంచి చదువులు చదవాలని ఆమె అన్నారు. పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలో ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా మంచి చదువులు చదవాలని విద్యార్థులను ఆయన కోరారు.
పోలవరం జిల్లాలో పదవ తరగతిలో, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో రాష్ట్రస్థాయి జిల్లా స్థాయిలో మంచి మార్కులతో పాసవి ఈరోజు 20వేల రూపాయల ప్రైజ్ మనీ, మెడల్, సర్టిఫికెట్ తీసుకోవడం చాలా గొప్ప విషయమని అదేవిధంగా ఈరోజు తీసుకున్న సర్టిఫికెట్లు మెడల్స్ ప్రైజ్ మనీ విద్యార్థుల జీవితాలలో మర్చిపోని రోజు అని ఆయన అన్నారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్లె సునీత మాట్లాడుతూ నేను మారుమూల గ్రామం లో జన్మించి చదువుకొని ఈరోజు ఈ స్థాయి వరకు చదువు వలనే నేను రావడం జరిగిందని ఆమె అన్నారు. ప్రతి మనిషికి ముఖ్యమైనది చదువు ఒకటేనని అదేవిధంగా ప్రతి బాల బాలిక చిన్నప్పటి నుండే చదువుపై దృష్టి పెట్టి మంచి మంచి చదువులు చదవాలని ఆమె అన్నారు.
ప్రతి మనిషికి విద్య ఒక మార్గాన్ని చూపిస్తుందని అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలను చదువులకు ప్రోత్సహించాలని ఆమె అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆమె అన్నారు. టీచర్ చెప్పిన పాఠాలు విద్యార్థుల శ్రద్ధగా విని ఎప్పటికప్పుడు చెప్పిన పాఠాలు పూర్తి చేసుకోవాలని ఆమె అన్నారు.
ఈ ప్రాంతంలోనీ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఈ ఆర్థిక సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా మీ తోటి విద్యార్థులను బాగా చదువుకునే విధంగా ప్రోత్సహించాలని ఆమె అన్నారు.
అనంతరం ముఖ్య అతిధుల చేతుల మీదగా విద్యార్థులకు మెడల్స్, 20వేల రూపాయల ప్రైజ్ మనీ, సర్టిఫికెట్లు విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అంద జేసీ విద్యార్థులకు అభినందనలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, ఎస్ఎస్సి అధికారి భాస్కర్ రావు,జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.ఉమా, సహాయక గిరిజన సంక్షేమ శాఖ అధికారి జి. తమ్ముడు, ఎంఈఓ శ్రీనివాసరావు,డాక్టర్ నీలిమ,చిన్నిబాబు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.




