Rampachodavaram: ఓటరు జాబితా సవరణ పనులను పరిశీలించిన కలెక్టర్

Rampachodavaram: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SSR) ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

Prasanna, Rampachodavaram
Published on: 30 Jun 2026 7:42 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: ఓటరు జాబితా సవరణ పనులను పరిశీలించిన కలెక్టర్

Rampachodavaram: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా పోలవరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రంపచోడవరం గ్రామంలోని పోలింగ్ కేంద్రం నెం.204ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. తహశీల్దారుతో కలిసి పోలింగ్ కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారాల (EF) డిజిటైజేషన్ పనులను పరిశీలించి, సంబంధిత బీఎల్‌వోలు, సూపర్వైజర్లతో మాట్లాడారు. ఫారాల వివరాలను ఎటువంటి పొరపాట్లు లేకుండా, నాణ్యతతో, వేగవంతంగా డిజిటైజేషన్ చేయాలని సూచించారు.

ప్రతి అర్హ ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఫీల్డ్ స్థాయిలో సేకరించిన సమాచారాన్ని సకాలంలో డిజిటైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫారాల పరిశీలన, డేటా నమోదు ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

అలాగే బీఎల్‌వోలు, సూపర్వైజర్లు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్, డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సంప్రదించి ఫారాల సేకరణను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story