Rampachodavaram: గిరిజన బాలికల పాఠశాలలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Rampachodavaram: పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ & ఐటీడీఏ పీఓ సురపాటి ప్రశాంత్ కుమార్ రంపచోడవరం ఇర్లపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Rampachodavaram: గిరిజన బాలికల పాఠశాలలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Rampachodavaram: ప్రతి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు విద్యతోపాటు ఈ సీజన్లో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సురపాటి ప్రశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రంపచోడవరం మండలం ఇర్లపల్లి గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలలో చదువుతున్న బాల బాలికలకు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఒకటికి రెండుసార్లు విద్యార్థులకు విద్యను బోధించాలని సంబంధిత ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజు మెనూ పక్కగా అమలు చేయాలని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు ఆశ్రమ పాఠశాలల ప్రాంగణాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న ఎడల వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకొని వెళ్లి వైద్యం చేయించాలని ఆయన అన్నారు.
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులందరికీ పుస్తకాలు,బట్టలు, తదితర విద్య సామాగ్రి విద్యార్థులకు అందజేసింది లేనిది ఆయన ఆరా తీశారు. అదేవిధంగా పాఠశాలలోనే భోజనశాలను,స్టోర్ రూమ్ను లో ఉన్న గుడ్లను, కూరగాయలను ఆయన పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ వారి వెంట గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మండయ్య, తాసిల్దార్ సిహెచ్.బాలాజీ, ప్రధానోపాధ్యాయురాలు యస్.రాజేశ్వరి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.




