Polavaram: పోలవరం ఎమ్మెల్యే పై దాడి

Polavaram: పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పూనెం వంశీ అనే వ్యక్తి దాడికి ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 11 Jun 2026 4:01 PM IST
Polavaram
X

Polavaram: పోలవరం ఎమ్మెల్యే పై దాడి

Polavaram: పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై పూనం వంశీ అనే వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వంశీని, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినారు సదరు వ్యక్తి.

నన్నే పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తావా అంటూ పూనం వంశీ ఈరోజు ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి ఎమ్మెల్యే తో వాగ్వివాదం చేస్తూ దాడికి ప్రయత్నించాడు వెంటనే, అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్మెన్ సదరు వ్యక్తిని నిర్బంధించి పోలీసులకు సమాచారం తెలిపినారు.

వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న జీలుగుమిల్లి పోలీసులు పూనెం వంశీని అదుపులోకి తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM

Next Story