Polavaram: పోలవరంలో రూ.90 లక్షలతో పెద్ద రామాలయం పనులు వేగవంతం!

Polavaram: గోదావరి పుష్కర పనుల్లో భాగంగా పోలవరంలో రూ.90 లక్షలతో చేపట్టిన పెద్ద రామాలయ నిర్మాణ పనులను దేవస్థానం ఈవో మంగళంపల్లి సంగమేశ్వర శర్మ మంగళవారం పరిశీలించారు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 8 Sept 2026 7:37 PM IST
Polavaram
X

Polavaram: పోలవరంలో రూ.90 లక్షలతో పెద్ద రామాలయం పనులు వేగవంతం!

పోలవరం: పుష్కర పనుల్లో భాగంగా పోలవరం లో నిర్మాణం చేపట్టిన పెద్ద రామాలయం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని దేవస్థానం ఈవో మంగళంపల్లి సంగమేశ్వర శర్మ అన్నారు. మంగళవారం పోలవరంలో 90 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన పనులను డిఇ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఆలయం చుట్టు కొలతలు, వాడుతున్న మెటీరియలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయం కట్టడంలో ఏ మాత్రం అవకతవకలు జరిగిన అది కాంట్రాక్టర్ కే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. రామాలయం కట్టడం అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని తెలిపారు. రామాలయం తో పాటు అయ్యప్ప స్వామి గుడి, వంటశాల , ధ్వజస్తంభం లాంటివి కూడా ఈ ఆదాయాలకే కట్టడం జరుగుతుందని చెప్పారు.

ప్రతిరోజు తప్పనిసరిగా సైట్ ఇంజనీర్ వచ్చి రామాలయం పనులు దగ్గరే ఉండి చేయించాలని అధికారులను ఆదేశించారు. పోలవరం తెలుగుదేశం మండల అధ్యక్షుడు మంగిన కొండ, నల్లా రాంబాబు, నారాయణరావు ఉన్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM