Polavaram: విజ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం!
Polavaram: ఏలూరు జిల్లా పోలవరం విజ్ఞాన భారతి స్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించిన విద్యార్థులు, బహుమతుల పంపిణీ.
Polavaram: విజ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం!
Polavaram: ఏలూరు జిల్లా పోలవరం స్థానిక విజ్ఞాన భారతి స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ నీటి సంఘాల అధ్యక్షులు బ్రహ్మయ్య గారు, రెవిన్యూ రిటైర్డ్ ఉద్యోగి ముత్యాల రాంబాబు, జర్నలిస్ట్ అసోసియేషన్ పోలవరం ప్రెసిడెంట్ రంజిత్ హాజరై మన స్వాతంత్రం కోసం అనేక వీరుల త్యాగఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం అని చెప్పారు.
విద్యార్థులు చక్కగా చదువుకొని దేశం గర్వించేలా ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిస్తున్నామన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల బహుకరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, సంతోషిని, రేణుక, ఆశ్లేష, తులసి, భావన, మరియు ఆయాలు పాల్గొన్నారు.




