Eluru: కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రూ.13 లక్షల హషిష్ ఆయిల్ సీజ్!
Eluru: ఏలూరు జిల్లా కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రూ.13 లక్షల విలువైన లీటర్ హషిష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్‌పై తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Eluru: కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రూ.13 లక్షల హషిష్ ఆయిల్ సీజ్!
ఏలూరు: ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని కలపర్రు టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు లీటర్ హషిష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి)ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అరకు నుంచి పల్నాడు జిల్లాకు బైక్‌పై తరలిస్తుండగా తిరుమల సాయి, వెంకట సాయిలను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హషిష్ ఆయిల్ విలువ సుమారు రూ.13 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.లీటర్ హషిష్ ఆయిల్ సుమారు 14 కిలోల సాధారణ గంజాయికి సమానం అని అధికారులు తెలిపారు.
Next Story




