Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ZPTC MPTC నామినేషన్ల ప్రక్రియ
Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పీటీసి, ఎంపీటీసి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ZPTC MPTC నామినేషన్ల ప్రక్రియ
Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసి,ఎంపీటీసి నామినేషన్ల ప్రక్రియ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు.
ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి కేంద్రానికి ఒక ఎస్సైని,సమస్యాత్మక ప్రాంతాలలో సీఐ స్థాయి అధికారులను ప్రత్యేక ఇన్చార్జ్లుగా నియమించారు.నామినేషన్ దాఖలుకు అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరిని మాత్రమే కేంద్రంలోకి అనుమతించారు.
నామినేషన్ల సమయంలో బెదిరింపులు లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్,అత్యవసర నెంబర్ 112 లేదా ప్రత్యేక నెంబర్ 9550351100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ సూచించారు.అభ్యర్థులందరికీ పూర్తి భద్రత ఉంటుందని,ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అన్ని రాజకీయ పార్టీలు,అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.




