Eluru: వ్యాయామం, ఆహారపు అలవాట్లతో మధుమేహ నివారణ: డీఎంహెచ్‌వో శోభ!

Eluru: ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా ఏలూరు పవర్ పేట యూపీహెచ్‌సీలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. శోభ మాట్లాడారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Nov 2026 9:46 PM IST
Eluru
X

Eluru: వ్యాయామం, ఆహారపు అలవాట్లతో మధుమేహ నివారణ: డీఎంహెచ్‌వో శోభ!

Eluru: మధుమేహాన్ని రాకుండా కొన్ని వ్యాయామాలు మరియు ఆహారపు అలవాట్లు ద్వారా నివారించుకోవచ్చని డిఎంహెచ్వో డా.శోభ తెలియజేశారు. ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఏలూరులోని పవర్ పేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు మధుమేహం నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా డిఎంహెచ్వో డా.శోభ మాట్లాడుతూ మధుమేహం వచ్చిన తర్వాత తరచూ మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి మధుమేహ పరీక్షలు చేయించుకొని వైద్యం సలహాలు పాటిస్తూ మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డా.లక్ష్మీనారాయణ డా.నరేంద్ర కృష్ణ మరియు యు పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ గౌతమ్ రాజు మరియు స్థానికులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్