Rampachodavaram: రంపచోడవరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!

Rampachodavaram: రంపచోడవరం పరిధిలో ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలు. హాజరైన రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి.

Prasanna, Rampachodavaram
Published on: 18 Sept 2026 12:06 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!

Rampachodavaram: భారత ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆకాంక్షించారు. మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల మండల సముదాయం లో గురువారం ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకల్ని మండల పార్టీ అధ్యక్షులు గురుకు శేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సేవా సంకల్ప్ అభియాన్ ఆశీర్వాదం దికా దీయ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ వంటి సమర్ధ నాయకత్వం మన దేశానికి వరమన్నారు. ఆయన సామాజిక స్రృహ కలిగిన ధీశాలి అని కొనియాడారు. ఆయన 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన 2014 నుండి నేటి వరకు భారత ప్రధానిగా ఆయన చేస్తున్న సంస్కరణలు యావత్ దేశానికి గర్వకారణం అని కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర నేపద్యంలో ఆయన అమలు చేసిన పలు కీలక సంక్షేమ పథకాలు వగైరా పథకాలు పై వివరించారు.

ఆయన ప్రజా రాజకీయంలో మకుటం లేని మహారాజులా రాణిస్తున్నట్లు పేర్కొన్నారు.అలాంటి నాయకత్వం మన దేశానికి అత్యంత అవశ్యకమని పేర్కొన్నారు. ఆయన ప్రజా సేవలో 25 సం" లు పూర్తి చేసుకున్నందున ఆయన అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పై లబ్ధిదారులు , యువత, మహిళలు, ఇలా అన్ని రకాల ప్రజానీకానికి చైతన్యం చేసేలా నేటి నుండి అక్టోబర్ 17 వరకు ప్రతీ గ్రామంలో వికసిత్ భరత్ -వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో వాడవాడలా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నింటిపై అవగాహన కల్పించాలని కోరారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని దీపాలు వెలిగించి ప్రజా సేవకి కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు కుడిపూడి సత్తిబాబు గారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభాని ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు తెలుగుదేశం పార్టీ మారేడుమిల్లి మండల అధ్యక్షులు గురుకు శేష్ కుమార్ ఐ టి డి పి రంపచోడవరం నియోజకవర్గం అధ్యక్షులు పాము రాంబాబు మండల ప్రధాన కార్యదర్శి కర్రీ సన్యాసిరెడ్డి తెలుగు యువత అధ్యక్షులు మల్లా బలరాం మాజీ మండల అధ్యక్షులు బీసెట్టి అప్పాజీ కోడూరు సత్యనారాయణ మురళ ప్రకాష్ బీసెట్టి శివరాజ్ కోడూరు తేజ ఫేక్ బషీర్,రంపచోడవరం బిజెపి జిల్లా అధ్యక్షులు బుల్లికొండలు దొర,టీడీపీ మండల అధ్యక్షుడు పెంటపాటి అనంత మోహన్, జన సేన మండల అధ్యక్షుడు prp శ్రీను, బీజేపీ మండల అధ్యక్షుడు జంగం దొర, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అడబాల బాపి రాజు, నియోజకవర్గ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ పండా చల్లన్న దొర, సిద్ధ వెంకన్న దొర, గణపతి, సాధన సత్య, గొర్ల శ్రీకాంత్,మండల అధ్యక్షుల కురుసాం రాజబాబు, జిల్లా కార్యదర్శి ముత్యాల. విష్ణుమూర్తి, మండల, మండల ప్రధాన కార్యదర్శి సరోబోలు.

విశ్వనాథం,మండల యువమోర్చా అధ్యక్షులు చోడి . విశ్వనాథ0, మండల కిషన్‌ మోర్చ ఉపాధ్యాక్షులు కోటం .బుల్లి అబ్బాయి, మహిళ మోర్చా ప్రధాన కార్యదర్మి ,మడకం. రామలక్ష్మి రోలిపల్లి. బాతు. శ్రావణ కుమార్ వెంకట క్రిష్ణరెడ్డి, చోడి. బాలు దొర, కంజం. విశ్వనాథం, శారాపు. నూక రాజు, మిరియాల. రాంబాబు,శారాపు. జొగిదోద, కారం. వెంకట రమణ, మాడకం. రత్న, యువమోర్చా ప్రధాన కార్యదర్మి,ఈక.శత్తిబాబు, జన సేన నాయుకుడు కర్ర.నర్సయ్య, ఈక.రాజు బాబు జినసేన మహిళ నాయకురాలు సీత మహా లక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, వంకా సతీష్, ఆడారి నాగబాబు,జుజ్జువరపు శ్రీనివాస్ చౌదరి, క్లస్టర్ ఇంచార్జీ గుంజిగెడ్డ గంగరాజు, కో క్లస్టర్ బెలెం సత్యనారాయణ, తెలుగు యువత మండల నాయకులు సాకేటి రాజా, బూత్ ఇంచార్జిలు బఠాని వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు మరియు మొదలగు వారు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram