Rampachodavaram: రంపచోడవరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ

Rampachodavaram: ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పేదల పాలిట అభయహస్తంలా నిలుస్తోందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే శిరీషాదేవి పేర్కొన్నారు.

Prasanna, Rampachodavaram
Published on: 16 July 2026 8:54 AM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ

Rampachodavaram: ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదల పాలిట అభయహస్తం లా ఉందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంప చోడవరం మండలం ఆమె క్యాంపు కార్యాలయంలో బుధవారం మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్ అధ్యక్షతన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె ప్రకటన విడుదల చేశారు. దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామానికి చెందిన తైనం నాగ సత్యవేణికి హృదయ సంబంధం సమస్యలతో సతమత మవుతున్నారు. విషయం తెలుసుకున్న ఆమె బాధితురాలిని పిలిచి ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.

దీనిలో భాగంగా రూ;2,00,000/- (అక్షరాల రెండు లక్షల రూపాయలు) LOC మంజూరు చేయించారు. దీనిని క్యాంపు కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది బాధితురాలు సత్య నాగవేణికి అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పతివాడ రమణ తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story