Rampachodavaram: జడ్డంగిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Rampachodavaram: జడ్డంగి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు.

Prasanna, Rampachodavaram
Published on: 1 July 2026 1:42 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: జడ్డంగిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Rampachodavaram: పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు పంపిణీలో రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా ఉంటున్నట్లు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం జడ్డoగి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు కూటమి శ్రేణులు,గ్రామస్తులు హారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రతీ లబ్ధిదారు ఇంటికీ వెళ్ళి పింఛన్లు అందించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఎలా ఉన్నారు ఏమి కావాలి అంటూ వారి ఇంట్లో కుటుంబ సభ్యులుగా మారిపోయారు. కొత్తగా పింఛన్లు త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రూ;2,711.79 కోట్లు రూపాయలు కేవలం పింఛన్లు కోసం వ్యయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 62,19,648 మంది లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. అలాగే ఇటీవల స్పౌజ్ కేటగిరీలో మంజూరు అయిన 7792మందికి కూడా పింఛన్లు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏది ఏమైనా మొదటి తారీఖునే లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒకవేళ మొదటి తేదీ ప్రభుత్వ సెలవు దినం అయితే ముందురోజే పింఛన్లు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పలు మౌళిక సదుపాయాల కోసం గ్రామస్తులు విన్నవించా స్పందించిన ఆమె అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్లు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టిలో పెట్టాలని సూచించారు. ప్రతీ నెలా మొదటి తేదీనే పింఛన్లు పేదల సేవకోసం కేటాయిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ముప్పన కేశవ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, తెదేపా నాయకులు గణజాల తాతారావ్, AMC డైరెక్టర్ గట్టి మాణిక్యం, మండల తెలుగుయువత నాయకులు బారంగి అనుదీప్, కాళ్ళకూరి సత్య సుందరం, చవల కుమార్ బాబు చెక్కా పండు బాబు , మండల పరిషత్ అభివృద్ధి అధికారి లోకుల యాదగిరీశ్వర రావు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story