Eluru: గ్రంథాలయ వారోత్సవాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు!
Eluru: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు, క్విజ్ పోటీలు నిర్వహించారు.
Eluru: గ్రంథాలయ వారోత్సవాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు!
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం సమాచార హక్కు చట్టంపై టీమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మ శివరామకృష్ణ అధ్యక్షత వహించగా,జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు,మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని వక్తలు పేర్కొన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావును ఆయన సేవలను గుర్తిస్తూ శాలువాతో సత్కరించారు.అనంతరం విద్యార్థులకు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు.
అలాగే గ్రంథాలయ ఉద్యమకారులు ఎస్.ఆర్. రంగనాథన్,అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది,ఉపాధ్యాయులు,విద్యార్థులు,పాఠకులు తదితరులు పాల్గొన్నారు.




