Eluru: గ్రామీణాభివృద్ధే కూటమి ధ్యేయం: మంత్రి పార్థసారథి

Eluru: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఏలూరు జిల్లా మీర్జాపురంలో రూ.1.22 కోట్ల సీసీ రోడ్లను ప్రారంభిస్తూ మంత్రి పార్థసారథి అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 9:36 PM IST
Eluru
X

Eluru: గ్రామీణాభివృద్ధే కూటమి ధ్యేయం: మంత్రి పార్థసారథి

ఏలూరు జిల్లా: రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం జోడు గుర్రాల్లా వేగంగా ముందుకు సాగుతున్నాయని,పట్టణ,గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో మంగళవారం రూ. 1.22 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు మంగళహారతులు,కుంకుమ తిలకంతో ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ తాగునీరు, డ్రైనేజీ,విద్యుత్తు,రహదారులు వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. రవాణా ఇబ్బందులు లేకుండా అంతర్గత రహదారులను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నామని,పనుల్లో నాణ్యత,పారదర్శకత పాటిస్తూ నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నూజివీడు అభివృద్ధి రథాన్ని ఎవరు అడ్డుకున్నా ఆగదని,ప్రజా ఆశయాల సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,కూటమి పార్టీల నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్