Eluru: పట్టిసీమ గోదావరి రేవులో పారిశుధ్య లోపం - భక్తుల ఇబ్బందులు!

Eluru: ఏలూరు జిల్లా పట్టిసీమ గోదావరి రేవులో వినాయక నిమజ్జన వ్యర్థాలతో పారిశుధ్య లోపం. దుర్వాసనతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై గ్రామస్తుల ఆగ్రహం.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 10 Oct 2026 8:09 AM IST
Eluru
X

Eluru: పట్టిసీమ గోదావరి రేవులో పారిశుధ్య లోపం - భక్తుల ఇబ్బందులు!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామం వద్ద వినాయక చవితి పురస్కరించుకుని వినాయకుని విగ్రహాలు నిమజ్జనం నిమిత్తం పట్టిసీమ గోదావరి రేవు వద్ద నిమజ్జన వినాయకుల విగ్రహాలతో పారిశుధ్యం తో శివతాండవిస్తోంది నిమజ్జనాలు జరిగే వారం రోజులు గడిచిన రేవులను శుభ్రపరచకుండా గ్రామపంచాయతీ మొద్దు నిద్రలో ఉంది ప్రతిరోజు ఇదే రేవు నుండి వందలాది భక్తులు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానానికి దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు.

ఈ విగ్రహాలకు ఉపయోగించు కెమికల్, పీచు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లడంతో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు ఇంత జరుగుతున్న పట్టిసీమ గ్రామపంచాయతీ కి మాత్రం కనబడటం లేదు రేవులు శుభ్రపరచవలసిన బాధ్యతలు ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టి ఈ రేవులను శుభ్రపరచవలసిందిగా గ్రామస్తులు, మరియు భక్తులు కోరుకుంటున్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM