Kukkunoor: డీజే నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించిన కుక్కునూరు పోలీసులు!

Kukkunoor: కుక్కునూరు పోలీసుల ఆధ్వర్యంలో డీజే ఆపరేటర్లకు అవగాహన సదస్సు. రాత్రి 10 తర్వాత డీజేలు వాడితే చర్యలు తప్పవని ఎస్సై రాజారెడ్డి హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2026 1:52 PM IST
Kukkunoor
X

Kukkunoor: డీజే నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించిన కుక్కునూరు పోలీసులు!

Kukkunoor: రాబోయే పండుగలు, మతపరమైన కార్యక్రమాలు, విగ్రహ నిమజ్జనాల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై కుక్కునూరు పోలీసుల ఆధ్వర్యంలో డీజే నిర్వాహకులు, ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద పరికరాల వినియోగంపై అమలులో ఉన్న నిబంధనలు, సైలెన్స్ జోన్‌లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఊరేగింపులు, నిమజ్జనాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని, అధికారుల చట్టబద్ధమైన ఆదేశాలను పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజారెడ్డి హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్