Eluru: యుద్ధ ప్రభావిత దేశాల్లో నకిలీ ఉద్యోగాల పట్ల అప్రమత్తత: కలెక్టర్!

Eluru: యుద్ధ ప్రభావిత దేశాల్లోని నకిలీ ఉద్యోగ ఆఫర్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Nov 2026 7:58 PM IST
Eluru
X

Eluru: యుద్ధ ప్రభావిత దేశాల్లో నకిలీ ఉద్యోగాల పట్ల అప్రమత్తత: కలెక్టర్!

Eluru: యుద్ధ ప్రభావిత దేశాల్లోని నకిలీ ఉద్యోగ ఆఫర్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని,వాటి ప్రామాణికతను నియామక ఏజెంట్లు క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్)మరియు స్థానిక ఏజెంట్ల ద్వారా రష్యాలో తోటపని, శుభ్రత,మెకానికల్ వంటి సాధారణ ఉద్యోగాల పేరుతో యువతను ఆకర్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.

అక్కడికి వెళ్లాక వారిని బలవంతంగా రష్యన్ సైన్యంలో చేర్చి,యుద్ధ క్షేత్రాలకు పంపుతున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టి (APNRT) సొసైటీ హెచ్చరించిందని పేర్కొన్నారు.ఇటువంటి మోసాల బారిన పడకుండా స్థానిక మీడియా,కేబుల్ టీవీలు,కళాశాలలు,విద్యా సంస్థలు మరియు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

మోసపూరిత నియామక ఏజెంట్లపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా ప్రకటనలను సైబర్ క్రైమ్ పోలీసులు పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్