Eluru: ఏలూరు జిల్లాలో 'స్వచ్ఛతా హి సేవా – 2026' పోస్టర్ ఆవిష్కరణ!

Eluru: 'స్వచ్ఛతా హి సేవా – 2026' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్ డా. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పోస్టర్లు ఆవిష్కరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Sept 2026 1:51 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో 'స్వచ్ఛతా హి సేవా – 2026' పోస్టర్ ఆవిష్కరణ!

Eluru: ఏలూరు జిల్లాలో ‘స్వచ్ఛతా హి సేవా – 2026’ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ డా.యం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను (పోస్టర్లను) ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని,అది ప్రతి ఒక్కరి బాధ్యతగా మరియు ప్రజల జీవన విధానంలో భాగంగా మారాలని ఆకాంక్షించారు.సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నెల రోజుల పాటు జరిగే ఈ ఉద్యమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు,సఫాయిమిత్రలు,పారిశుద్ధ్య కార్మికులు,యువత మరియు ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామాలు,పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరుస్తూ,వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జి.వి.కె.మల్లిఖార్జునరావు, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకట లక్ష్మమ్మ,డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి,ఐసిడిఎస్ పిడి పి.శారద,జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్