Kukunoor: శ్రీధర వేలేరు ఎంపీటీసీగా తాళ్లూరు సురేష్ నామినేషన్

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని శ్రీధర వేలేరు ఎంపీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన అభ్యర్థి తాళ్లూరు సురేష్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 21 Oct 2026 8:50 PM IST
Kukunoor
X

Kukunoor: శ్రీధర వేలేరు ఎంపీటీసీగా తాళ్లూరు సురేష్ నామినేషన్

కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని శ్రీధర వేలేరు పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన అభ్యర్థి తాళ్లూరు సురేష్ నామినేషన్ దాఖలు చేశారు.

తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తాళ్లూరు సురేష్ కుక్కునూరు మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రానికి చేరుకుని, శ్రీధర వేలేరు ఎంపీటీసీ స్థానానికి తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కుక్కునూరు మండలంలో రాజకీయ సందడి నెలకొంటోంది. శ్రీధర వేలేరు పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి తాళ్లూరు సురేష్ నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR