Tangellamudi: తంగెళ్లమూడి, బీడీ కాలనీలో బాలల భద్రతపై అవగాహన సదస్సు
Tangellamudi: తంగెళ్లమూడి సూర్య పబ్లిక్ స్కూల్, బీడీ కాలనీ సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో న్యాయసేవాధికార అవగాహన; పోక్సో చట్టం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ 1500 వివరాలు.
Tangellamudi: తంగెళ్లమూడి, బీడీ కాలనీలో బాలల భద్రతపై అవగాహన సదస్సు
తంగెళ్లమూడి: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 'సమాజంలో సురక్షితమైన రేపటి కోసం నేటి అవగాహన' కార్యక్రమంలో భాగంగా శనివారం తంగెళ్లమూడిలోని సూర్య పబ్లిక్ స్కూల్,బీడీ కాలనీలోని సెయింట్ ఆంథోనీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్యానల్ లాయర్ పి.వెంకటేశ్వరరావు,సోషల్ వర్కర్ వై.యామిని శ్రీలత మానవ అక్రమ రవాణా,పోక్సో చట్టం,సురక్షిత స్పర్శ, బాలల భద్రతపై అవగాహన కల్పించారు.
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,సమస్యలు ఎదురైతే ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు లేదా జిల్లా న్యాయసేవాధికార సంస్థ హెల్ప్‌లైన్ 1500కు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,డైరెక్టర్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.




