Eluru: ఏలూరు జిల్లాలో రూ.600 కోట్ల ఎంఓయూల లక్ష్యం: కలెక్టర్

Eluru: గుంటూరులో జరగనున్న అమరావతి రీజినల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఏలూరు జిల్లా నుంచి రూ.600 కోట్ల ఎంఓయూలే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Oct 2026 8:45 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో రూ.600 కోట్ల ఎంఓయూల లక్ష్యం: కలెక్టర్

ఏలూరు జిల్లా: ఈనెల 16న గుంటూరులో జరగనున్న అమరావతి ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో ఏలూరు జిల్లా నుండి రూ.600 కోట్ల విలువైన ఎంఓయూలు (MOU) కుదిరేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.గురువారం ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ హాలులో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడతో కలిసి ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు,ఎంఎస్ఎంఈ (MSME)లతో పాటు మధ్యతరహా,భారీ పరిశ్రమల ఏర్పాటుకు భారీగా ఎంఓయూలు జరిగేలా చూడాలి అని పారిశ్రామికవేత్తలను గుర్తించి,వారు పెట్టే పెట్టుబడి, కల్పించే ఉద్యోగ అవకాశాలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నివేదికలు తయారు చేయాలి అని సదస్సులో జిల్లాకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, పారిశ్రామికవేత్తలకు సహకారం అందించడానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేయాలి అని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆర్. వెంకటరావు,ఐటీడీఏ పీవో రాములు నాయక్,జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా,డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి మరియు పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్