Nuzvid: నూజివీడు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బర్రె ఇళయరాజా 4,108 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీపై ఘనవిజయం సాధించారు.
Nuzvid: నూజివీడు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం
ఏలూరు జిల్లా: నూజివీడు మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) ఘన విజయం సాధించింది.మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.టీడీపీ తరపున చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రె ఇళయరాజా తన సమీప వైయస్సార్సీపీ (YSRCP) అభ్యర్థి కంచర్ల లవకుమార్ పై 4,108 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.లెక్కింపు ప్రారంభం నుండి టీడీపీ అభ్యర్థి బర్రె ఇళయరాజా స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 4,108 ఓట్ల మెజారిటీతో ఆయన చైర్మన్ అభ్యర్థిగా గెలుపొందినట్లు అధికారులు ధృవీకరించారు.
నూజివీడు మున్సిపాలిటీలో టీడీపీ సాధించిన ఈ భారీ విజయంపై పార్టీ శ్రేణులు,నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.




