Rampachodavaram: రంపచోడవరంలో ఘనంగా టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం!
Rampachodavaram: రంపచోడవరంలో టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం. సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని నేతల పిలుపు.
Rampachodavaram: రంపచోడవరంలో ఘనంగా టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం!
Rampachodavaram: రంపచోడవరంలో తెదేపా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం. సమన్వయంతో మంచి ఫలితాలు సాధ్యం.
అధిష్ఠాన నిర్ణయాలు పార్టీ శ్రేణులు అవలంభించాలి. నాయకులు కార్యకర్తలు మధ్య మంచి సంబంధాలు ఉండాలి. పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు.
NDA కూటమిపార్టీల పొత్తుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండాలి. నియోజకవర్గ అత్యవసర విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న జోనల్ కో ఆర్డినేటర్ అరిమిల్లి రాధాకృష్ణ. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే లు సీతంశెట్టి వెంకటేశ్వర రావు, చిన్నం బాబురమేష్ &వంతల రాజేశ్వరి& అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు ఎమ్.తేజోవతి. నియోజక వర్గ పార్టీ పరిశీలకులు కోట్ని బాలాజీ మరియు స్థానిక సంస్థలు ఎన్నికల పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి.
పార్టీ శ్రేణులు సమన్వయం తో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యం అవుతాయని జోనల్ కో -ఆర్డినేటర్ అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. రంప చోడవరం ఆర్. పి. ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో మంగళవారం నియోజక వర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిష్ఠాన నిర్ణయాలు మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లమని చెప్పిన ప్రతీ కార్యక్రమం పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలి
నియోజకవర్గ స్థాయిలో ఆశించిన విధంగా విజయాలు సాధించాలంటే నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం ఆవశ్యకం అన్నారు. స్థానిక సమస్యలపై క్షుణ్ణంగా అవగాహన ఉండాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కారం కొరకు నాయకులకు తెలియజేసి పరిష్కారం చూపాలన్నారు. ఎవరు ఎలా పనిచేస్తున్నారో అనేది పార్టీ చూస్తోందన్నా రు. క్షేత్ర స్థాయిలో పనిచేసిన నివేదికలు పార్టీ నిఘా వర్గాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంత క్రియాశీలకంగా పనిచేస్తే అంత గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం పై నియోజక వర్గ స్థాయిలో నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎంత అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తే అంత స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు. స్థానిక నాయకత్వం యొక్క నివేదికలు మెరుగు పర్చు కోవాలన్నారు.
పార్టీ శ్రేణులు ప్రత్యేక బాధ్యతాయుతంగా పనిచేయాలి
పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ , ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రంప చోడవరం మండలం ఆర్. పి. ఫంక్షన్ హాల్ లో మంగళవారం నియోజక వర్గ పార్టీ పరిశీలకులు కోట్ని బాలాజీ మరియు స్థానిక సంస్థలు ఎన్నికల పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు సౌజన్యంలో నియోజక వర్గ పార్టీ అత్యవసర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త గెలుపు కోసం పని చేయాలన్నారు. కార్యకర్తల కోసంఎంత చేయాలో అంతా చేశానన్నారు. ఇంకా తనవంతుగా ఏమి చేయాలో చెబితే సాధ్యమైనంత వరకు సహాయ చర్యలు చేపడతామన్నారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తల అభీష్టానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందించే రాయితీలు, అభివృద్ధి సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో ప్రతీ ఇంటికీ వెళ్ళి డోర్ టు డోర్ కార్యక్రమాలు విషయంలో వేగం పెంచాలన్నారు. ఇప్పటి వరకు మన పార్టీ గెలుపొందిన తరువాత మనం చేసిన అభివృద్ధి పై కార్యకర్తలే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలన్నారు.
అధిష్ఠాన ఆదేశాలు మేరకు పనిచేయండి
అధిష్ఠాన ఆదేశాలు మేరకు పనిచేసి విజయఢంకా మోగించాలని స్థానిక సంస్థలు ఎన్నికల పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కోట్ని బాలాజీలు పిలుపునిచ్చారు. రంప చోడవరం మండలం ఆర్. పి. ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన నియోజక వర్గ పార్టీ విస్తృతస్థాయి సమీక్షా సమావేశం లో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త ఒక సైనికుడు గా పనిచేయాలన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు మీవి అన్నారు. కాబట్టి పార్టీ ఎవరికి అభ్యర్థిత్వం ఇస్తుందో వారికి మనందరం కలిసికట్టుగా గెలిపించాలన్నారు. మరియు మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్,వంతల రాజేశ్వరిలు మాట్లాడుతూ కూటమి పొత్తులో భాగంగా అందరినీ కలుపుకు పోవాలని కోరారు. పార్టీ శ్రేణులు ఎప్పుడూ నిరంతర సైనికుల్లా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధిపై క్షుణ్ణంగా వివరించారు.
కంచుకోట లాంటి తెలుగుదేశం పార్టీతోనే ఏజెన్సీలో సుస్థిరాభివృద్ధికి బాటలు పడినట్లు వారు స్పష్టం చేశారు. అందరము కలిసికట్టుగా పని చేయడానికి కంకణబద్దులు గా ఉండాలన్నారు. మన జిల్లాను మరింత అభివృద్ధి సాధించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల బలోపేతం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత AMC చైర్మన్ లోతా లక్ష్మణరావు తదితరులు మాట్లాడారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్, వంతల రాజేశ్వరి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత , APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ సభ్యులు షేక్ సుభానీ, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు దంతులూరి శివరామ చంద్రరాజు, మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంత మోహన్, గురుకు శేషు కుమార్, జర్తా వెంకటరమణ రెడ్డి, పొత్తూరి కాంతారెడ్డి, జమాల్ ఖాన్, ఎడవల్లి భాస్కర రావు, బొర్రా నరేష్ కుమార్, బి. పుల్లయ్య, పల్లాల వెంకటరెడ్డి, గోళ్ళ చంటిబాబు, వాళ్ళ రంగారెడ్డి, నియోజక వర్గ ఎస్టీ విభాగం అధ్యక్షులు పండా బాపన్న దొర అనే బాబీ, సొసైటీ అధ్యక్షులు పాము అర్జున్, ముప్పన కేశవ్, రాజేష్, తెదేపా సీనియర్ నాయకులు అడబాల బాపిరాజు,గణజల తాతారావు, గొర్లె శ్రీకాంత్,కరక వెంకటరమణ,కనిగిరి రాంబాబు,సీతపల్లి దేవస్థానం గడి బాపనమ్మ తల్లి ధార్మిక మండలి చైర్మన్ బాపన్న దొర, నియోజక వర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ముప్పన సావిత్రి, మాజీ సర్పంచ్ వై.నిరంజనీదేవి, AMC డైరెక్టర్ గట్టి మాణిక్యం, మువ్వ శ్రీను, క్లస్టర్ ఇంచార్జీ కారం సింహాచలం, పార్టీ అనుబంధ కమిటీల ప్రతినిధులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




