Eluru: పాముకాటుకు గురైన టీడీపీ సీనియర్ నేత.. శ్రీనివాసులు పరామర్శ!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కోటగిరి సత్యనారాయణ పాముకాటుకు గురయ్యారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 25 Jun 2026 1:14 PM IST
Eluru
X

Eluru: పాముకాటుకు గురైన టీడీపీ సీనియర్ నేత.. శ్రీనివాసులు పరామర్శ!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గోమ్ముగూడెం పంచాయతీ పరిధిలోని సీతారామపురం గ్రామానికి చెందిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జి కోటగిరి సత్యనారాయణ రెండు రోజులు క్రితం పాము కాటుకు గురై జంగారెడ్డిగూడెం లోని మమత హాస్పటల్లో చికిత్స పొందుతున్నారని సమాచారం తెలియగానే,

పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు బుధవారం హాస్పిటల్ కి వెళ్లి కోటగిరి సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కోటగిరి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు యల్లాపు సురేష్, జిల్లా సోషల్ మీడియా కో-ఆడినేటర్ మనెల్లి బాలు తదితరులు ఉన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story