Velairpadu: వేలేరుపాడులో టీడీపీ ప్రచార హోరు: అశోక్ ఆధ్వర్యంలో దూకుడు
Velairpadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో టీడీపీ అధ్యక్షుడు అమరవరపు అశోక్ ఆధ్వర్యంలో కూటమి, సీపీఐ బలపరిచిన అభ్యర్థులు విస్తృత ప్రచారం చేపట్టారు.
Velairpadu: వేలేరుపాడులో టీడీపీ ప్రచార హోరు: అశోక్ ఆధ్వర్యంలో దూకుడు
వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. టీడీపీ మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్ ఆధ్వర్యంలో జనసేన, బిజెపి టీడీపీ, సిపిఐ పార్టీలు బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, తమకు మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తల సందడితో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచడంతో వేలేరుపాడు మండలంలో రాజకీయ సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు,కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




