Polavaram: పోలవరంలో పెద్దపులి సంచారం... అటవీశాఖ అప్రమత్తం!

Polavaram: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వద్ద పెద్దపులి దాడి చేసి గేదె దూడను చంపింది.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 31 Aug 2026 6:40 PM IST
Polavaram
X

Polavaram: పోలవరంలో పెద్దపులి సంచారం... అటవీశాఖ అప్రమత్తం!

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి మరోసారి కలకలం రేపింది. మామిడిగొందు వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌ సమీపంలో గేదె దూడపై పులి దాడి చేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్న అధికారులు.

ఆదివారం ఉదయం అక్కడికి వెళ్లి పరిశీలించగా గేదె దూడ మృతదేహం కనిపించింది. పరిసరాల్లో పులి అడుగుజాడలను గుర్తించిన అటవీశాఖ అధికారులు పులికి జిపిఎస్ ట్రాకర్ను అమర్చడంతో పులి కదలికలను పులి ఎటువైపు ప్రయాణం చేస్తుందో వాటి వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం పులి అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు నిర్ధారించారు.

దీంతో సమీప గ్రామాల ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని పశువుల కాపరులు తమ పశువుల పాకల వద్ద లైట్లను అమర్చి చుట్టూ నేరాలను కట్టాలని ఆరు బయటికి రాత్రుల సమయంలో ఒంటరిగా తిరగద్దని అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. పులి కదలికలను పర్యవేక్షిస్తూ అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పులిని బంధించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM