Eluru: బాలింతలు, దివ్యాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు!
Eluru: కలిదిండి మార్కెట్ కమిటీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించి, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతపై ఆదేశాలిచ్చారు.
Eluru: బాలింతలు, దివ్యాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు!
Eluru: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్,కౌంటింగ్ విధులను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా,నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు.శనివారం కలిదిండి మార్కెట్ కమిటీ ఆవరణలో ఎన్నికల సామాగ్రి పంపిణీ,కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.చిన్న పిల్లల తల్లులు,దివ్యాంగులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.రెండవ విడత ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 2,024 పోలింగ్ కేంద్రాలలో 673 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి,అక్కడ అదనపు పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రెండు విడతల శిక్షణలో నేర్చుకున్న అంశాల పై పూర్తి అవగాహనతో, ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ విజయలక్ష్మి,తహసీల్దార్ ఎల్వి.ఎస్.రామకృష్ణ, ఎండిఓ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




