Rampachodavaram: గిరిజన మహాగర్జనకు పోలీసుల ఆంక్షలు: రోడ్డుపైనే ధర్నా!
Rampachodavaram: రంపచోడవరం గిరిజన మహాగర్జనకు వెళ్లకుండా చింతూరు ఏజెన్సీలో పోలీసుల ఆంక్షలు. ఐటీడీఏ ఎదుట రోడ్డుపై బైఠాయించి గిరిజనుల తీవ్ర నిరసన, నినాదాలు.
Rampachodavaram: గిరిజన మహాగర్జనకు పోలీసుల ఆంక్షలు: రోడ్డుపైనే ధర్నా!
రంపచోడవరం: రంపచోడవరం లో నేడు జరిగే గిరిజన మహాగర్జన సభకు చింతూరు ఏజెన్సీ నుండి వెళుతున్న గిరిజనులను పోలీసులు ఎక్కడికి అక్కడే ఆపివేయడం జరిగింది. వర రామచంద్రపురం,చింతూరు మండలాల నుండి వాహనాల్లో బయలుదేరిన గిరిజనులను పోలీసులు రహదారి పైనే ఆపివేయడం చేశారు. దీంతో గిరిజనులు పోలీసుల తీరుపై ఆగ్రహించి పోలీసులు ఆపివేసిన చోటే రహదారి పైన గిరిజనులు బైఠాయించి నినాదాలు చేశారు.
చింతూరు మండలానికి చెందిన గిరిజనులు మహాసభకు వెళ్లకుండా ఆపివేయడంతో చింతూరు ఐటిడిఏ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గిరిజనుల న్యాయమైన కోరికలు పరిష్కారానికై ఓ మహా గర్జన సభ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుందో తెలియటం లేదని గిరిజనులు వాపోతున్నారు. శాంతియుతంగా గిరిజనులు మహా గర్జన సభ ఏర్పాటు చేసుకుంటే పోలీసులు విడ్డూరంగా గిరిజనులు ఎక్కడికక్కడే నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు.




