Unguturu: అమరావతి ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతుల ప్రధానం ఎమ్మెల్యే ధర్మరాజు

Unguturu: ఉంగుటూరులో ముగిసిన అమరావతి ఛాంపియన్షిప్–2026 క్రీడలు. విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు. వాలీబాల్ ఆడి సందడి చేసిన ఎమ్మెల్యే.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 1 Aug 2026 6:38 AM IST
Unguturu
X

Unguturu: అమరావతి ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతుల ప్రధానం ఎమ్మెల్యే ధర్మరాజు

ఉంగుటూరు: ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం ఆవరణలో చివరి రోజు ఘనంగా జరిగిన క్రీడాలు - చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే విద్యార్థులకు ఉజ్వల భవిష్యతాన్న ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్–2026లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు యువ క్రీడాకారులను అభినందించి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో మమేకమయ్యారు. అనంతరం యువతతో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఆడి వారిలో క్రీడాస్ఫూర్తిని నింపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడిని అభినందిస్తూ గెలుపు–ఓటములకు అతీతంగా క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన అండర్–17, అండర్–23 బాలురు, బాలికల్లో క్రీడ విభాగాల వారీగా విజేతలకు ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విజేతలందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై ఉంగుటూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ, విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగే అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని, అక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఎమ్మెల్యే తెలిపారు. విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల్లోనూ రాణించి ఉంగుటూరు నియోజకవర్గానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ NDA కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు (PEDలు), ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story