Gundugolanu: కాలనీలో నూతన మంచినీటి పైప్‌లైన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Gundugolanu: ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనులో ₹10 లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి పైప్‌లైన్‌ను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 28 July 2026 10:33 PM IST
Gundugolanu
X

Gundugolanu: కాలనీలో నూతన మంచినీటి పైప్‌లైన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గుండుగొలను: గుండుగొలను గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ లైన్ ను ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు.గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన త్రాగునీటి సదుపాయాల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే గారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో హౌసింగ్ కాలనీ నందు గ్రామ పంచాయతీ నిధులు 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మంచినీటి సరఫరా పైప్ లైన్ ను మండల కూటమి నాయకులతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో, రాష్ట్రంలో త్రాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కృషి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించే దిశగా జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా పనులు చేపడుతున్నామన్నారు.

నియోజకవర్గంలోని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ వ్యవస్థల ఏర్పాటు, వాటర్ ఫిల్టర్ బెడ్ల మరమ్మతులు, త్రాగునీటి సరఫరా మెరుగుదల వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమడోలు మండల జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story