Unguturu: ఉంగుటూరులో మూడో రోజు కొనసాగిన వైఎస్సార్‌సీపీ దీక్ష

Unguturu: ఉంగుటూరు నేషనల్ హైవే సెంటర్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 8 Aug 2026 9:55 PM IST
Unguturu
X

Unguturu: ఉంగుటూరులో మూడో రోజు కొనసాగిన వైఎస్సార్‌సీపీ దీక్ష

ఉంగుటూరు: డీఎస్సీ–2025 నియామకాలలో చోటుచేసుకున్న అవకతవకలు, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, నిరుద్యోగ భృతి అమలులో జాప్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యాదీవెన–వసతి దీవెన నిధుల విడుదలలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉంగుటూరు నేషనల్ హైవే సెంటర్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో కార్యకర్తలు విద్యార్థులు మరియు యువతతో కలిసి పాల్గొన్న ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు గారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాలపై సమగ్ర విచారణ జరిపి అనుమానాలను నివృత్తి చేయాలని అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అని మెగా DSC అని ధగ DSC చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు అని ఏద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల హామీలను విస్మరించి యువత భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని, యువతకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.ఈ నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొని తమ

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story