Unguturu: ఉంగుటూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
Unguturu: ఉంగుటూరు నియోజకవర్గం బువ్వనపల్లిలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ రౌండ్ టేబుల్ సమావేశం.
Unguturu: ఉంగుటూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు పుప్పాల వాసుబాబు గారు పరిరక్షణ లో బువ్వనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గస్థాయి టౌన్ హాల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ముఖ్యంగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై నియోజకవర్గం టౌన్ హాల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వక్తలు మరియు డీఎస్సీ అభ్యర్థలు,విద్యార్థులు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ చేయించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు మరియు విద్యార్థులు నిరుద్యోగులు తో పాటు ఉంగుటూరు నియోజకవర్గం పరిశీలకుడు ఏ.ఎస్ రాజు, ఉంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షుడు మరియు జడ్పిటిసి కోడే కాశి, పార్లమెంట్ కార్యదర్శి వెజ్జు వెంకటేశ్వరరావు, గణపవరం మండల పార్టీ అధ్యక్షులు దండు రాము, భీమడోలు మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి సత్య శ్రీనివాస్, నిడమర్రు మండల పార్టీ అధ్యక్షులు సంకు సత్యకుమార్, రాష్ట్ర వైఎస్ఆర్సిపి బూత్ వింగ్ కార్యదర్శి యిలిశెట్టి బాబ్జి,రాష్ట్రీయ యూత్ కార్యదర్శి మద్దుల రాజా,ముళ్ళగీరి జాన్సన్, ఉంగుటూరు నియోజకవర్గ ysrtf అధ్యక్షులు మద్దాల రామకృష్ణ,నడింపల్లి సోమరాజు, సూర్యబలిజ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శెట్టిరాజా, గణపవరం మండల యూత్ అధ్యక్షులు కొట్టు నరేష్, పాల్గొన్నారు.




