Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు!

Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని చేతివృత్తిదారులు నైపుణ్యాలు పెంచుకోవాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Sept 2026 1:55 PM IST
Eluru
X

Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు!

Eluru: ప్రభుత్వ పథకాల ద్వారా చేతివృత్తిదారులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఏలూరు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు.గురువారం స్థానిక కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి ఇంచార్జ్ కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భగవాన్ విశ్వకర్మ వృత్తి నైపుణ్యానికి ప్రతీక అని,దేవతల దివ్య శిల్పి అని కొనియాడారు.పురాణాల ప్రకారం ద్వారక, ఇంద్రప్రస్థం, బంగారు లంకలను విశ్వకర్మ నిర్మించారని గుర్తుచేశారు.వడ్రంగులు,కమ్మరులు,స్వర్ణకారులు, శిల్పులు విశ్వకర్మను తమ దైవంగా భావిస్తారన్నారు.

'పీఎం విశ్వకర్మ యోజన' పథకం కింద కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయ చేతివృత్తుల వారికి తక్కువ వడ్డీకే రుణాలు, టూల్ కిట్స్ అందిస్తోందని తెలిపారు.ఈ అవకాశాన్ని వాడుకుని చేతివృత్తిదారులు ఆర్థికంగా ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి విశ్వమోహన్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్