Velairpadu: రుద్రమకోటలో ఓటర్ల జాబితాపై గ్రామసభ నిర్వహణ

Velairpadu: వేలేరుపాడు మండలం రుద్రమకోటలో డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాపై గ్రామసభ నిర్వహించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 5 Sept 2026 6:02 PM IST
Velairpadu
X

Velairpadu: రుద్రమకోటలో ఓటర్ల జాబితాపై గ్రామసభ నిర్వహణ

వేలేరుపాడు: మండల పరిధిలోని రుద్రమకోట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితాపై గ్రామసభ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభకు రుద్రమకోట కూటమి నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్ల జాబితాను చదివి వినిపించారు. ప్రస్తుతం రుద్రమకోట గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 912 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కనిపించకపోవచ్చని వివరించారు.

అదేవిధంగా గ్రామంలో మరణించిన వ్యక్తులు, గ్రామం విడిచి వెళ్లిన వారి వివరాలను గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ పూర్తి వివరాలతో పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

గ్రామసభ అనంతరం కూటమి నాయకులతో కలిసి స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రుద్రమకోట కూటమి నాయకులు కొవ్వాల క్రాంతికుమార్, అమరవరపు వెంకటేశ్వర్లు, సారే బాబ్జి, సచివాలయ సిబ్బంది అనిత, జయరాజు, భవాని, నలజల రాజేష్, జొన్నల సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story