Velerupadu: గోదావరి దాటితేనే పోలింగ్ 367 మంది ఓటర్ల కోసం ఏర్పాట్లు

Velerupadu: వేలేరుపాడు మండలం గోదావరి ఆవల ఉన్న పేరంటాలపల్లి, కాకిసునూరు, టేకుపల్లి గ్రామాల్లో 367 మంది ఓటర్ల కోసం లాంచీల ద్వారా సిబ్బంది, సామగ్రి తరలింపు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 25 Nov 2026 8:48 PM IST
Velerupadu
X

Velerupadu: గోదావరి దాటితేనే పోలింగ్ 367 మంది ఓటర్ల కోసం ఏర్పాట్లు

వేలేరుపాడు: మండలంలోని మారుమూల గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కోయిదా పంచాయతీ పరిధిలోని పేరంటాలపల్లి, కాకిసునూరు, టేకుపల్లి గ్రామాలు గోదావరి నదికి ఆవల ఉండటంతో ఎన్నికల సిబ్బంది లాంచీల ద్వారా ప్రయాణించి పోలింగ్ నిర్వహించేందుకు తరలివెళ్తున్నారు.

ఈ మూడు గ్రామాల్లో మొత్తం 367 మంది ఓటర్లు ఉండగా, ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేలేరుపాడు మండల కేంద్రానికి సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ సైతం అందని మారుమూల ప్రాంతాలు కావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల సిబ్బంది కోయిదా వరకు బస్సులో ప్రయాణించి, అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో లాంచీలపై గోదావరిని దాటుతున్నారు. పోలీసు బందోబస్తు నడుమ మూడు గ్రామాలకు చేరుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR