Velerupadu: వేలేరుపాడులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి!
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్. ఉదయం 11 గంటలకు 23 శాతం పోలింగ్ నమోదు: విలేకరి బుల్ల నాగరాజు నివేదిక.
Velerupadu: వేలేరుపాడులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి!
Velerupadu: మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అధికారులు మొత్తం 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటల సమయానికి మండలంలో 23 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.




