Velerupadu: వేలేరుపాడు మండలంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 78.28% నమోదు

Velerupadu: వేలేరుపాడు మండలంలో 7 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానానికి ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. 78.28% పోలింగ్ నమోదు. ఏలూరు నోవా కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 6 Nov 2026 8:32 PM IST
Velerupadu
X

Velerupadu: వేలేరుపాడు మండలంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 78.28% నమోదు

వేలేరుపాడు: మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం అధికారులు మండలవ్యాప్తంగా 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి మండలంలో మొత్తం 78.28 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు, పురుషులు, యువత ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలీసుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి, పటిష్ట భద్రత నడుమ ఏలూరు జిల్లా వేగవరంలోని నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR