Velerupadu: పేరంటాలపల్లిలో మూన్నాళ్ల ముచ్చటగా సోలార్ వెలుగులు
Velerupadu: వేలేరుపాడు మండలం పేరంటాలపల్లిలో సోలార్ సిస్టమ్ పనిచేయకపోవడంతో గ్రామం చీకటిమయమైంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి.
Velerupadu: పేరంటాలపల్లిలో మూన్నాళ్ల ముచ్చటగా సోలార్ వెలుగులు
వేలేరుపాడు: మండల పరిధిలోని పేరంటాలపల్లి గ్రామంలో సోలార్ ప్లేట్ సిస్టం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. నెలరోజుల క్రితం గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లు కేవలం మూడు రోజుల పాటు మాత్రమే పనిచేసేయని, తర్వాత నుంచి పనిచేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
సోలార్ లైట్లు పనిచేయకపోవడంతో గ్రామం పరిసర ప్రాంతాలు రాత్రివేళ పూర్తిగా చీకటిమయంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు. చీకటి కారణంగా ఇళ్ల పరిసరాల్లోకి విషసర్పాలు, ఇతర క్రిమికీటకాలు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
రాత్రి సమయాల్లో అత్యవసరంగా బయటకు రావాల్సిన పరిస్థితుల్లో కూడా చీకటి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గ్రామంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా వెంటనే సోలార్ వ్యవస్థను పరిశీలించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
నెల రోజుల క్రితం ఎంతో ఆశతో ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ కొద్దిరోజులకే పనిచేయకుండా పోవడంపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి సాంకేతిక లోపాలను గుర్తించి సోలార్ ప్లేట్లు, లైట్లను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి పేరంటాలపల్లి గ్రామానికి తిరిగి వెలుగులు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.




