Kukunoor: కుక్కునూరులో వెలుగు వీవోఏ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో వెలుగు వీవోఏ నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఖాళీ సీసీ పోస్టును భర్తీ చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 20 Aug 2026 9:14 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరులో వెలుగు వీవోఏ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఖాళీగా ఉన్న సీసీ పోస్టును వెంటనే భర్తీ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు. మండలంలో మొత్తం నాలుగు క్లస్టర్లు ఉండగా ప్రస్తుతం ముగ్గురు సీసీలు మాత్రమే ఉన్నారని, ఒక క్లస్టర్‌కు మరో క్లస్టర్‌కు చెందిన సీసీని ఇన్‌చార్జిగా కేటాయించడం వల్ల వీవోఏలకు పనుల నిర్వహణ, సమన్వయం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

ప్రతి క్లస్టర్‌కు ప్రత్యేకంగా సీసీని నియమించాలని కోరారు. గురువారం సుందరయ్య భవనం ప్రజా సంఘాల కార్యాలయంలో కుర్రా గ్రేసీ అధ్యక్షతన వెలుగు వీవోఏ (యాణిమేటర్లు)ఉద్యోగుల సంఘం (సిఐటియు) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యర్నం సాయికిరణ్ మాట్లాడుతూ వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వీవోఏలతో అదనపు పనులు చేయించరాదని డిమాండ్ చేశారు. గౌరవ వేతనం ప్రతి నెలా 5వ తేదీలోపు వీవోఏల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

నాలుగు క్లస్టర్లకు నలుగురు సీసీలు ఉండాల్సి ఉండగా ఒక పోస్టు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జి విధానంతో సమస్యలు తలెత్తుతున్నందున ఖాళీ పోస్టును వెంటనే భర్తీ చేయాలని అన్నారు. అనంతరం వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కుర్రా గ్రేసీ, కార్యదర్శిగా దాసరి సౌజన్య, కోశాధికారిగా కొండయ్య, ఉపాధ్యక్షులుగా అయినాల నాగలక్ష్మి, బంటి దీప, సహాయ కార్యదర్శిగా మేడవరపు రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో వీవోఏలు కృపాజ్యోతి, తేజ, వెంకటలక్ష్మి, శ్రీదేవి, తులసి, కృష్ణవేణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story